సముద్రాలు ఏడడుగులు పెరుగుతయ్
ముంబై, కోల్ కతాతో పాటు ప్రపం చంలోని పెద్ద పెద్ద నగరాలను ముంచేసే ప్రమాదాన్ని తీసుకొస్తున్నాయి. మరో ముప్పై ఏళ్లలో అంటే 2050 నాటికి ప్రపంచంలో ని అతి పెద్ద తీర ప్రాంత నగరాలను సముద్రాలు తమలో కలిపేసుకునేందుకు ఏటికేడు పెరిగిపో తున్నాయి. అమెరికాకు చెందిన క్లెమేట్ సెంట్రల్ అనే సంస్థ చేసిన తాజా సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. యూఎన్ ఐపీసీసీ స్టడీల్లోని లెక్క లను సవరించి తాజాగా ఈ గణాంకాలను క్లెమేట్ సెంట్రల్ వివరించింది. మూడు అడుగులు కాదని, ఏడడుగులు సముద్రాలు పెరుగుతాయని హెచ్చ రించింది. రిలాక్స్ గా ఉండాల్సిన టైం కాదని సూచించింది. 30 కోట్ల మంది.. సముద్ర మట్టాలు పెరగడం వల్ల తీర ప్రాంతా ల్లో ఉండే జనంపై పెద్ద ప్రభావమే పడుతుందని క్లైమేట్ సెంట్రల్ స్టడీ తేల్చింది. 2050 నాటికి 30 కోట్ల మంది ఏటా వరదలకు, 2100 నాటికి పూర్తిగా మునిగిపోవడం వల్ల 20 కోట్ల మంది పూర్తిగా తమ జీవనాధారాలను కోల్పోతారని హె చ్చరించింది. 2050 నాటికి మనకు ఎడమవైపున ఉన్న అరేబియా సముద్రం, కుడివైపున ఉన్న బం గాళాఖాతం సముద్రాల మట్టాలు గణనీయంగా పెరిగిపోతాయట. దాని వల్ల ముంబై, కోల్ కతా నగరాలు పూర్తిగా మునిగిపోతాయట. దాని ప్రభా వంతో ఎక్కువగా ఇండియా జనమే నష్టపోతారని స్టడీ తేల్చింది. లక్షలాది మంది సముద్రాల ధాటికి జీవనోపాధిని కోల్పోతారని హెచ్చరించింది. ప్రాణ నష్టమూ జరిగే ముప్పు ఉందని పేర్కొంది. ఆసియాలోనే ఎక్కువ మన ముంబై, కోల్ కతాలే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 26 దేశాల్లో (ఇండియాతో 27)ని ముఖ్యమైన సిటీలకూ ఇదే పరిస్థితి ఎదురవుతుం దని క్లెమేట్ సెంట్రల్ స్టడీ తేల్చింది. చైనాలోని షాంఘై, టియాంజిన్, హాంకాంగ్, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, వియత్నాం రాజధాని హనోయి, ఇండోనేసియా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, జపాన్ లోని సిటీలు బాగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పింది. మిగతా దేశాల్లో నూ ఎఫెక్ట్ ఉన్నా ఆసియా ఖండం లోని ఈ దేశాలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. వియత్నాంలోని దక్షిణ భాగం మొత్తం వరదతో మునిగిపోయే ప్ర మాదముందని పేర్కొంది. 2100 నాటికి బ్రిటన్ , బ్రెజిల్ , అమెరికా వంటి దేశాల్లోని సిటీలూ శాశ్వతంగా సముద్రంలో కలిసిపోయే ముప్పు ఉంటుందని తెలిపింది. బ్యాంకాక్ , షాంఘై, అలెగ్జాండ్రియా, ఆమ్ స్టర్ డ్యాం వంటి నగరాలూ ముంపు ముంగిట నిలుస్తాయని పేర్కొంది. స్టడీ కొంచెం కొత్తగా ఇంతకుముందు చేసిన స్టడీల్లో శాటిలైట్ డేటాను వాడుకున్నారు సైంటిస్టులు. అయితే, సముద్ర మట్టాల పెరుగుదల వల్ల ఎంత భూమి కోల్పోతా మో, అసలు భూమి ఎంత అన్న లెక్కలు కొంచెం గందరగోళంగా ఉన్నాయట. అంటే అసలు భూమి, ఆ భూమిలో ఉన్న చెట్లు, పుట్టలు, కట్టిన బిల్డింగుల మధ్య లెక్కలను కరెక్ట్ గా వేయలేదట. అసలు భూమితో పాటు వాటన్నింటినీ లెక్కలోకి తీసుకుని దాన్నే మనకు అందుబాటులో ఉన్న అసలైన భూమిగా లెక్కలు వేశారట. దాని వల్ల పాత స్టడీలో లోపాలున్నాయని క్లెమేట్ సెంట్రల్ సైంటిస్టులు అంటున్నారు. అందుకే ఆ తేడాలు రాకుండా న్యూరల్ నెట్ వర్క్స్, ఆర్టిఫిషియల్ ఇం టెలిజెన్స్ ను వాడుకుని శాటిలైట్ డేటాను కరెక్ట్ చేశామని సైంటిస్టులు చెబుతున్నారు. పాత పద్ద తిలో కాకుండా అసలు భూమి ఆధారంగా లెక్కలు వేస్తే కరెక్ట్ అంచనాకు రావచ్చంటున్నారు. ఐస్ కరుగుతోంది , ఇప్పటికే గ్రీన్‌ల్యాండ్ సహా ఆర్కిటిక్, అంటార్కిటి కాల్లోని మంచు కరిగిపోతోంది. గ్లేసియర్లు కను మరుగవుతున్నాయి. దాని వల్ల సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. 2006 నుంచి 2015 మధ్య ఏటా సగటున గ్రీన్‌ల్యాండ్లో 275 గిగాటన్నుల ఐస్ (27,500 కోట్ల టన్నులు) కరిగిపోయింది. ఇది గత నెలలో ఐక్యరాజ్య సమితి ఇంటర్ గవ ర్నమెంటల్ పానెల్ ఆన్ క్లెమేట్ చేంజ్ (ఐపీసీసీ) ఇచ్చిన నివేదిక చెప్పిన విషయమే. అంటార్కిటిక్ లోనూ అదే రేంజ్ లో ఐస్ కరిగిపోతోంది. 2007 నుంచి 2016 మధ్య కోల్పోయిన మంచు, అంత కుముందు పదేళ్లలో కోల్పోయిన ఐసు మూడు రెట్లు ఎక్కువ. మొన్నామధ్య స్విట్జర్లాండ్ లోని ఓ గ్లేసియర్ పూర్తిగా పోయిన సంగతి తెలిసిందే. వీటన్నింటి వల్ల సముద్ర మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. పసిఫిక్ ఐలాండ్ మొత్తం మరి కొన్నేళ్లలోనే పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది . దాని వల్ల కొన్ని కోట్ల మంది శరణు కోరుతూ వేరే దేశాలకు వలస వెళ్లే ముప్పు పొంచి ఉంది. అంతేకాదు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల టెంపరేచర్లు పెరిగి పంటలపై ప్రభావం పడుతుంది. దాని వల్ల కొన్ని కోట్ల మంది తిండి, నీళ్ల కొరతతో అల్లాడి పోతారట. ఆరోగ్య సమస్య లు ఎక్కువవుతాయట. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ దారుణంగా పడిపోతుందట.