అక్టోబర్ 5నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తు న్నారు. దాదాపు 36 రోజుల కిం - దటే సమ్మె నోటీసు ఇచ్చిన ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడంతో కార్మిక సంఘాలన్నీ ఐక్య - మై సుమారు 50 వేల మంది కా ర్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. సీఎం కేసీఆర్ సమ్మె చేసే కార్మికుల్ని 'బ్లాక్ మెయిల్ చేస్తున్నారు'తంగిరాల చక్రవడంతో - . తొలగిస్తామంటూ ఒక రోజు, వాళ్లే మానేశారంటూ మ రోరోజు, ఎస్మా ప్రయోగిస్తామంటూ ఇంకోరోజు ప్రకట నలు చేశారు. కొత్తగా నోటిఫికేషన్ ఇస్తామని కార్మికుల ను బెదిరిస్తున్నారు. పనిలో పనిగా కమ్యూనిస్టు పార్టీ పాలించిన కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో ఆర్టీసీని ఎందుకు ప్రభుత్వంలో విలీనం చేయలేదు? అని ప్రశ్నించారు. ఇ ది ఆయన అవగాహన లేమికి నిదర్శనం. నేడు కేరళలో పాలక సీపీఐ(ఎం) అక్కడి ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్ల నిధులు ఇస్తోంది. ఈ మూడేండ్ల కాలంలో మూడువేల కోట్లు విడుదల చేసింది. గతంలో బెంగాలను పాలించి న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం 6 శాతంగా ఉన్న జాతీయీ కరణను 66 శాతానికి పెంచిన చరిత్ర తెలుసుకోవాలి. ఆర్టీసీ ప్రయివేటీకరణకు నిస్సిగ్గుగా పథక రచన చేసే కేసీఆర్ వామపక్షాల సర్కార్లు చేసే కార్మికవర్గ అనుకూల విధానాలను అధ్యయనం చేయాలి. అక్కడి కార్మికులకు పింఛన్లు, తక్కువ వడ్డీకి అప్పు, ఇతర సబ్సిడీలు ఇస్తోంది. ప్రభుత్వం. ఈ సంవత్సరం కేరళలో ఆర్టీసీకి అక్కడి ప్ర భుత్వం 3వేల కోట్లు అప్పు ఇచ్చి వడ్డీ భారాన్ని తానే భ రిస్తున్నది. పింఛన్ సౌకర్యం ఆ రాష్ట్ర ప్రభుత్వోద్యోగు లతో సమానంగా ఇస్తోంది. ఏనాడూ కార్మికులపై ఉక్కు పాదం మోపలేదు. ముఖ్యమంత్రి వామపక్ష ప్రభుత్వం రాయితీలు, సబ్సిడీలపైన ఒకసారి అధ్యయనం చేసి మాట్లాడాలి. ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిన తరువాత ఈ రాష్ట్ర ఆర్టీసీ అప్పు కేవలం రూ.1964 కోట్లు. ఆరేండ్ల కాలంలో రూ.3,491 కోట్లకు చేరింది. దీనికి కారకులు ఎవరు? 30శాతం ప్రయివేటు వారిని మేపిన యాజమాన్యం కాదా? ఇంకా ప్రయివేటీకరణ జట్ల పం చేస్తున్నారు కేసీఆర్. ఒక్క డీజిల్ పై కడుతున్న పన్ను లు రూ.600 కోట్లు ఉంటుంది. దీన్ని మినహాయింపు ఇస్తే ఆర్టీసీ అప్పుల ఊబి నుండి బయటపడదా? సబ్సిడీ బస్సుల రాయితీలకు సంబంధించిన సొమ్ము రూ.2,822.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ ప్రభుత్వం కేవలం రూ.638.79 కోట్లు మా త్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది. తెలంగాణ రాష్ట్రం కోసం సకల జనుల సమ్మెలో కార్మికులు పోరాడిన సమ యంలో వారిని కీర్తించిన కేసీఆర్ నేడు తూలనాడటం శోచనీయం. తెలంగాణలో 3 లక్షల ఉద్యోగులున్నారు. ఆర్టీసీలో 50 వేల మంది ఉన్నారు. 33 జిల్లాల్లో 204 ప్రభుత్వ కార్యాలయ శాఖలున్నాయి. 1932లో నిజాం నెలకొల్పిన ఆర్టీసీ 1958లో ఏపీ ప్రభుత్వంలో కలిసిం ది. ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పడింది. పాలకుల విధా నాల వల్లే నష్టాల భారిన పడిన ఆర్టీసీ రూ.5,775కోట్ల నష్టాల్లో కూరుకుపోయింది. సంవత్సరానికి సగటున రూ.వెయ్యి కోట్ల నష్టం కలుగుతుంది. ఇలా ఎన్నైనా ఉ దాహరణలు చెప్పవచ్చు. ఈ నష్టాలకు కారణం ప్రభు త్వం రాయితీల పేరుతో ఆర్టీసీ పై మోపుతున్న భారాలు కాదా? 2014-19 దాకా రూ.2,700 కోట్లు ఈ ప్రభు త్వం ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం రూ.790 కోట్లు మాత్రమే. టోల్‌ప్లాజా కింద రూ.60 కోట్లు, డీజిల్ పై రూ. 600కోట్లు. మోటార్ వాహన సంస్థకు రూ.230 కోట్లు. మోడీ జీఎస్టీకి రూ.100 కోట్లు. ఇలా ఏటా రూ. వెయ్యి కోట్లు ప్రభుత్వానికి చెల్లిస్తోంది. ఆర్టీసీ. రోజు 49.33వేల మంది కార్మికులు సమయం చూడకుండా రాత్రి, పగలు పని చేస్తున్నారు. దాదాపు 35 లక్షల కి. మీ. వాహనాలను నడుపుతున్నారు. 3,726 రూట్లలో బస్సులు తిప్పుతున్నారు. 97.66 లక్షల మంది ప్ర యాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. ప్రయాణి కుల ఆక్సూ పెన్సీ రేషియో 73.12శాతంగా ఉంది. టికె జట్ల ద్వారా రోజుకు 11.06 కోట్ల చొప్పున నెలకు రూ. 330 కోట్లు, సంవత్సరానికి రూ.3,690 కోట్లు, వాణిజ్య ఆదాయం రూ. 920 కోట్ల చొప్పున ఏడాదికి 4,880 కోట్ల ఆదాయం ఉన్న ఆర్టీసీ ఎందుకు నష్టాల్లో ఉంది? ఈ ఆదాయం పై గతంలో 14.5 శాతం వ్యాట్ ఉంటే నేడు జీఎనీ 28శాతం పెంచారు కదా? బస్ బాడీ బిల్డింగ్ పై 5శాతం వ్యాట్ ఉంటే నేడు అది 28 శాతానికి పెంచారు కదా? ఇందుకు కారణమెవరు? కార్మికులా? 2018-19లో పాస్ రీయింబర్స్ మెంట్ కోసం ప్రభుత్వ 0 ఆర్టీసీకి 664 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ. 130 కోట్లు ఇస్తే ఎలా? టీఆర్ఎస్ పాలనా కాలంలో మొత్తం బకాయి రూ.2,200 కోట్లు పేరుకు పోయింది. ఇప్పుడు చెప్పండి ఆర్టీసీ నష్టాలకు ఎవరు కారకులు? ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి, ఒకసారి ఎల్‌బీనగర్ సెంటర్ లో నిలబడి చూస్తే ఎన్ని ప్రయివేటు బస్సులు బెజవాడ వెళ్తున్నాయో తెలుస్తుంది. నేడు కార్మికులు ఏం కోరుతున్నారు? డీఏలు, బోనస్లు, జీతాల పెంపు అడి గారా? లేదే? ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపి పరిరక్షించ మంటున్నారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా ఇవ్వమని అంటున్నారు. 2017 వేతన ఒప్పందం అమలు చేయ మని కోరుతున్నారు. అద్దె బస్సులు వద్దు, ఆర్టీసీ బస్సులే నడపాలి. కొత్తవి కొనాలి, బస్సులు పెంచాలి. నష్టాల ఊబి నుంచి గట్టెక్కించే చర్యలు చేపట్టాలని కోరుతూ సమ్మెకు దిగడం న్యాయమైనదే కదా. సమ్మె కార్మికుని జ న్మహక్కు. 2003లో నాడు తమిళనాడులో జయలలిత లక్షమంది ఉద్యోగుల్ని తొలగిస్తే సమ్మె హక్కును సుప్రీం కోర్టు కూడా నిరాకరిస్తే దాన్ని కార్మికులు తిప్పికొట్టి విజ యం సాధించారుకదా. ఇలాంటి పరిణామాలన్నీ గుర్తిం చి ప్రభుత్వం మొండి వైఖరి వీడాలి. ఆర్టీసీని కాపాడాలి.
ఆర్టీసీ నష్టాలకు పాలకపక్షమే కారణం