తవ్వింది 50శాతమే

                           సింగరేణిలో గడిచిన ఏడు నెలల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా జరగడం లేదు. మొత్తం 11 డివిజన్లలో నాలుగు ఏరియాలు మాత్రమే వంద శాతానికి పైగా ఉత్పత్తిని సాధించగా.. మిగతా ఏడు డివిజన్లు వెనకబడి ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం కొత్తగా చేపట్టాల్సిన ప్రాజెక్టు పనులు ముందుకు సాగకపోవడం ఉత్పత్తి లక్ష్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఫలితంగా నెలల్లో 50శాతం ఉత్పత్తి మాత్రమే జరగడం గమనార్హం. ఈ క్రమంలోనే బొగ్గు ఉత్పత్తిపై శుక్రవారం హై దరాబాద్ లో అన్ని ఏరియాల జీఎంలతో సీఎండీ సమీక్ష జరిపారు 


                                               


వార్షిక ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నులు


సింగరేణి సంస్థ 2019-20 ఆర్థిక సంవత్సరాని కి గాను 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని వెలికితీయాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందుక నుగుణంగా గత ఏప్రిల్ నెల నుంచి బొగ్గు ఉత్పత్తి చేస్తున్నది. అయితే ఆనాటి నుంచి అక్టోబర్ నెల వరకు గడిచిన ఏడు నెలల కాలంలో 35.39 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి మాత్రమే వెలికి తీసింది. అంటే ఇప్పటి వరకు వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో 50 శాతం వరకు మాత్రమే బొగ్గు ఉత్ప త్తి చేయగలిగారు. మిగిలిన ఐదు నెలల్లో మరో 50 శాతం బొగ్గు వెలికితీయాల్సి ఉండగా.. ఆ మేరకు తీయగలుగుతారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణిలో కొత్తగూడెం ఏరియాలో 102 శాతం, ఇల్లందు ఏరియాలో 128 శాతం, మణుగూరు ఏరియాలో 102 శాతం, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో 104 శాతం బొగ్గు ఉత్పత్తి జరగగా.. మిగిలిన ఆర్టీ 1 ఏరియాలో 76 శాతం, ఆర్జీ 2 ఏరియాలో 94 శాతం, ఆర్జీ 3 ఏరియాలో 98 శాతం, భూపాలపల్లి ఏరియాలో 76 శాతం, బెల్లంపల్లి ఏరియాలో 67 శాతం, మందమర్రి ఏరియాలో 78 శాతం, శ్రీరాంపూర్ ఏరియాలో 98 శాతం బొగ్గు ఉత్పత్తి చేశారు. అంటే ఏడు ఏరియాలు తమకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో వెనకబడ్డాయి.


వానలే దెబ్బకొట్టాయి.. 


సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిలో ఎప్పుడు ముందుండే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు ఈ సారి వెనకబడి పోయాయి. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల్లో వర్షం ఎక్కువగా కురవడం వల్లనే పనులు సాగక ఈ పరిస్థితి ఏర్పడిందని అధికార వర్గాలు చెబుతు న్నాయి. 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లలో ఏడు నెలల కాలంలో 30.94 మిలియన్ టన్నుల లక్ష్యం నిర్ణయిస్తే 30.29 మిలియన్ టన్నుల బొగ్గు వెలి కితీశారు. అంటే ఓసీపీల మొత్తంగా చూస్తే 65 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి వెనకబడి ఉంది. ఇక భూగర్భ గనుల్లో ఏడు నెలల్లో 5.99 మిలియన్ టన్నుల లక్ష్యానికి గాను 5.19 మిలియన్ టన్నుల బొగ్గు వెలికితీశారు. ఇక్కడ కూడా 80 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయలేకపోయారు. ఈ రెండు కలిపి ఏడు నెలల కాలంలో బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికంటే 1.45 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లోటు ఏర్పడింది. ఈ లోటును పూడ్చడంతో పాటు రాబోయే ఐదు నెలల్లో 50 శాతం మేర బొగ్గు ఉత్ప త్తి చేయాలంటే సింగరేణిలో మరింత శ్రమించా ల్సిన పరిస్థితి ఏర్పడింది.


సన్నగిల్లిన ఆశలు..


సింగరేణిలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పలు కొత్త ప్రాజెక్ట్ ల వల్ల బొగ్గు ఉత్పత్తి వస్తుందని ఆశించినా అవి ముందుకు సాగకపో వడంతో ఆశలు సన్నగిల్లాయి. గోదావరిఖనిలో కొత్తగా ఆర్టీ ఓసీపీ 5ను ఏర్పాటు చేసి ఈ ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు వేసినా ఇంకా ప్రజాభి ప్రాయ సేకరణ కార్యక్రమమే జరగలేదు. ఇక మంచిర్యాల జిల్లా పరిధిలో కొత్తగా చేపట్టిన ఇందారం ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ కూడా ముందుకు సాగడం లేదు. ఇక్కడ ఓసీపీ ఏర్పాటు చేయవద్దని ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఇలా వివిధ ప్రాం తాల్లో మొదలు పెట్టాల్సిన ప్రాజెక్ట్లు ముందుకు సాగకపోవడంతో లక్ష్యంలో వెనకబడే అవకాశం ఉంది. ఈ క్రమంలో రాబోయే ఐదేళ్లలో బొగ్గు ఉత్పత్తి సాధనకు ఎలాంటి చర్యలు తీసుకోవాల నే అంశంపై శుక్రవారం హైదరాబాద్ సింగరేణి భవన్లో సంస్థ సీఎండీ ఎన్.శ్రీధర్ అన్ని ఏరియాల జీఎంలతో సమీక్ష జరిపారు.