కాజీపేట : కొత్త ఆవిష్కరణలకు వరంగల్ నిట్ వేదిక కావాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, సైంటిస్ట్ ఎన్. దివాకర్ అన్నారు. గురువారం రాత్రి నిట్ టెక్నో జియాన్ 2019కు సంబంధించి ప్రారంభ కార్య క్రమాన్ని ఆయన జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. నిట్ లోని అంబేద్కర్ లర్నింగ్ సెంటర్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. వరంగల్ నిట్ కు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉందన్నా రు.ని లో చదివేస్టూడెంట్స్ ఆలోచనల రూపంగా టెక్నోజియాన్ లో ఎగ్జిబిట్ లు ఉండటం కొత్త ఆవిష్కరణలకు కొత్త ఆలోచనలకు పునాది వేసే అవకాశం ఉందన్నారు. దక్షిణ భారత దేశంలో ఉన్ననిట్ లలో వరంగల్ నిట్ లో జరిగే టెక్నోజియా న్ కు అతిపెద్ద టెక్నోజియాన్ గా గుర్తింపు రావడం అభినందనీయమన్నారు. స్మార్ట్ మొబైల్స్, ఆన్ లైన్ బ్యాంకింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ లాంటివి టెక్నాల జీలో కొత్త ఆవిష్కరణ వల్లనే సాధ్యమయ్యా యని తెలిపారు.
టాలెంట్ కు టెక్నోజియాన్
నిట్ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడుతూ ఈ సారి టెక్నోజియాలో 5500 మంది పాల్గొనడాని కి రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. స్టూడెంట్స్ లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు టెక్నోజియాన్ వేదికగా ఉపయోగపడుతుంద న్నారు. ఈసారి టెక్నోజియాన్ లో ఎక్కువగా టె క్సికల్ ఎగ్జిబిట్ల ప్రదర్శనకే ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. గౌరవ అతిథి ఆడ్రోయిటెక్ ఇంజినీ రింగ్ సొల్యూషన్ లిమిటెడ్ డైరెక్టర్ నదింపల్లి ఆయూష్ మాట్లాడుతూ నిట్ టెక్నోజియాన్ లో సాంకేతిక పరమైన వర్క్ షాపులు నిర్వహించడం వల్ల ఇంజినీరింగ్ స్టూడెంట్స్ లో వివిధ అంశాలపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. నిట్ స్టూ డెంట్స్ వెల్ఫేర్ డీన్ ప్రొఫెసర్ ఎల్.రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ లాటిన్ భాషలో నో వస్ ది పల్స్ ఆఫ్ ఇన్నోవేషన్ పేరిట తెలుగులో కొత్త ఆవిష్కరణలు అనే అర్థం వచ్చేలా టెక్నోజియాన్ థీమ్ ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు రూపొందించిన 10 ఆవిష్కరణలను ఈ టెక్నోజియాన్ లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. నిట్ ప్యాకల్టీ అడ్వయిజర్ ఆంజనేయులు, నిట్ టె క్నోజియాన్ స్టూడెంట్ కో ఆర్డినేటర్ నిఖిల్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సాంకేతిక ప్రదర్శనలు
నిట్ లో టెక్నోజియాన్ ఇంజినీరింగ్ స్టూడెంట్స్ సందడి నెలకొంది. నిట్ టెక్నోజియాన్ 2019లో సాంకేతిక ప్రదర్శనలు నవంబర్ 1నుంచి 3వ తేది వరకు షెడ్యూల్ ప్రకారం జరుగనున్నాయి. వరంగల్ నిట్, ఇతర ఇంజినీరింగ్ కాలేజీలు, ఇతర నిట్ ల నుంచి సాంకేతిక ప్రదర్శనలో పా ల్గొనేందుకు స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈవెంట్లలో స్పాట్ లైట్లు, ప్రొ షోలు, ఇన్షియేటివ్ లు, వర్క్ షాపులు, సింగర్ శిర్లే సౌతియా తో పాట ల కార్యక్రమం, హీరో కార్తికేయతో ప్రొషో కార్యక్రమం ఉండను న్నాయి. నిట్ టెక్నోజియాన్ ఈవెంట్ నిర్వహణ కు ప్రధాన టైటిల్ స్పాన్సర్‌గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కో టైటిల్ స్పాన్సర్లుగా నాగార్జున కన్ స్ట్రక్షన్ కంపెనీ, తెలంగాణ కల్చరల్ అకాడమి వ్య వహరిస్తున్నాయి. .