సాయిసింధు క్రియేషన్స్ పతాకం పై పులి అనురాధ సమర్పణలో యాదగిరి చెంగల,మహేశ్వరి హీరోహీరోయిన్లుగా పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'సలామ్ హైదరాబాద్' సినిమాకు సంబంధించిన ఫస్టుక్ మరియు ట్రైలర్లను మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ వెంకటస్వామి గురువారం హైదరాబాద్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్ మాట్లాడుతూ తెలంగాణ భాష, సంస్కృతిలో బహుజనుల జీవితాలు,సమస్యలు ఇతివృత్తంగా తీసుకొని నిర్మించిన ఈ సినిమాను ప్రజలు విజయవంతం చేయాలని అన్నారు. పూర్తిగా తెలంగాణ భాషలో పులి అమృత్ స్వీయ దర్శకత్వంలో అందిస్తున్న ఈ సినిమా వందశాతం బహుజనుల బతుకు చిత్రమని అన్నారు.చిత్రం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ దక్కన్ టాకీస్ డాట్ కమ్ ఎటిటి ద్వారా త్వరలో విడుదల చేయనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా దర్శకనిర్మాత పులి అమృత్ తో పాటు చిత్ర ఎడిటర్ సురేష్ గుల్ల పెల్లి, సినిమాటోగ్రాఫర్ విశ్వనాధ్ బూడిద,చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మిగితా పాత్రల్లో కొమురం,రమేశ్ పంజాల,ఆకుల బాలకృష్ణ,బోనాల వెంకటస్వామి ",ఎల్లేష్,ఆజామ్, మోహన్ గౌడ్,లెనిన్ నర్సింహ,పొలికేక నాగన్న, బాలరాజ్, మాస్టర్ హర్ష తదితతరులు నటించారు. పాటలు : సునిల్ మ్యాదరి, సినిమాటోగ్రఫి : విశ్వనాథ్ అమర్‌నాథ్, ఎడిటింగ్ : సురేష్ గుల్లపెల్లి , కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, నిర్మాత, దర్శకత్వం : పులి అమృత్.
సలామ్ హైదరాబాద్ ఫస్టుక్ విడుదల చేసిన వివేక్ వెంకటస్వామి